అమెరికా నుంచి స్వగ్రామానికి సేవా పురస్కార సౌరభం
ప్రభుత్వ పాఠశాలల SSC టాపర్లకు ఘనంగా ప్రతిభా పురస్కారాల అందజేత పోరుమామిళ్ల.(ప్రజావాణి జూన్ 20) రాజధాని తుళ్లూరు జన్మభూమిపై మమకారంతో అమెరికాలో స్థిరపడిన ఎన్నారై గడ్డం వెంకటరమణ తన ఉదారతను చాటుకున్నారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పోరుమామిళ్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. స్థానిక SPS ఫంక్షన్ హాల్‌లో విద్యా వెలుగులు నింపేలా ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.స్థానిక ఉపాధ్యాయుడు శ్రీనివాసులు,సతీమణి సుహాసిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పురస్కారాల...