📄 ePaper
Wednesday, July 15, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamఅటు స్కాలర్షి ప్ వెబ్సైట్ పనిచేయదు.ఇటు కాలేజీ యాజమాన్యాల కొర్రీలు

అటు స్కాలర్షి ప్ వెబ్సైట్ పనిచేయదు.

ఇటు కాలేజీ యాజమాన్యాల కొర్రీలు

📰 Generate e-Paper Clip

అటు స్కాలర్షి ప్ వెబ్సైట్ పనిచేయదు.

ఇటు కాలేజీ యాజమాన్యాల కొర్రీలు

*నిలిచిపోయిన వెబ్సైట్ సేవలు.. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు…?

*నిజంగా సాంకేతిక కారణాల రీత్యా లేక నిధుల కొరత..

*ఇట్లైతే… విద్యార్థుల మనుగడ ఎట్లా…?


ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి


తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్థులకు ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఉపకార వేతనాలు (స్కాలర్షిప్లు) అందజేస్తూ ఆన్లైన్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఈపాస్ వెబ్సైట్ కొన్ని సాంకేతిక కారణాలతో గత రెండు రోజులుగా మొరాయిస్తుండటంతో ఖమ్మం జిల్లాలోని పేద ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్థులు ఖమ్మం కలెక్టరేట్లోని కార్యాలయాలకు చేరుకోని స్కాలర్షిప్లపై అధికారులను సంప్రదిస్తూ ఉసురుమంటూ వెళ్ళిపోతున్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల విద్యార్థుల ఉపకార వేతనాలు పెండింగ్లో ఉండటం ఇటీవల కొంతమేర రిలీజ్ చేయటం తో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లోని కార్యాలయాలకు చేరుకోని ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యం. కాగా గత రెండు రోజులుగా ఈపాస్ వెబ్సైట్ సర్వర్ బిజీగా ఉండటం వలన సేవలు నిలిచిపోయినట్లు తెలిసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల నుండి ఖమ్మం పట్టణానికి విద్యార్థులు క్యూపడుతున్న నేటి వరకు సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవటంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. కాగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఫీజు మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికెట్లు మంజూరు చేస్తాం ఇస్తామంటూ కొర్రీలు పెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నెలకొన్నట్లు సమాచారం. ప్రధానంగా ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల పరిధిలోని ఓ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరైనప్పటికీ అందించడం లేదని ఆరోపణలు విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విద్యార్థినీ విద్యార్థులు జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయానికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ప్రభుత్వం కొంతమేర విద్యార్థుల ఉపకార వేతనాలు అందించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు వ్యవహరిస్తూ విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ స్పందించి విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు సర్టిఫికెట్లు అందేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

*మరికొన్ని సమగ్ర వివరాలతో రేపటి కథనం…2లో…!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular