📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarఅక్రమ ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పట్టివేత

అక్రమ ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పట్టివేత

📰 Generate e-Paper Clip

డ్రైవర్లతోపాటు యజమానులపై కేసు నమోదు..

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఐ పృథ్విధర్ గౌడ్..

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):ప్రభుత్వం నుండి అనుమతి లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చిగురుమామిడి ఎస్సై పృథ్విధర్ గౌడ్ హెచ్చరించారు.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలోని మోయ తుమ్మెద వాగు నుండి ప్రభుత్వ నుండి ఎలాంటి అనుమతి లేకుండా దొంగతనంగా వాగు నుండి ముల్కనూర్ కు ఇసుక రవాణా చేస్తూన్న 3ట్రాక్టర్లను శుక్రవారం పట్టుకొని సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ఏపీ 15ఏయూ 3359నెంబర్ గల ట్రాక్టర్ డ్రైవర్ చెరుకు కుమారస్వామి,యజమాని అయిన మూలపాల శ్రీనివాస్,చెరుకు కుమారస్వామి రామంచ ట్రాక్టర్ నెంబర్ టీఎస్ 19 టి 7076 డ్రైవర్ కందుగుల ప్రశాంత్ దాని యజమాని అయిన తుంగ పరశురాములు, ట్రాక్టర్ నెంబర్ టి ఎస్ 22 టీ 1705 డ్రైవర్ నందకిశోర్,యజమాని అయిన వంటకాల రంజిత్ రెడ్డి అనువారిని పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ప్రభుత్వం నుండి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయడం నేరమని ఎస్సై పృధ్వీధర్ గౌడ్ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular