బెజ్జంకి,ఏప్రిల్ 28(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామ చివారులో అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంపుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడి చేశారు.గాగిల్లాపూర్ మోయతుమ్మెద వాగు నుండి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలించి నిల్వ చేస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి రాజీవ్ రహదారి కాలువ సమీపంలో తనిఖీలు నిర్వహించగా అక్కడ పెద్ద ఎత్తున నిల్వచేసిన ఇసుక డంపును గుర్తించి టాస్క్ పోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అలాగే ఇసుక తరలింపుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్‌ను కూడా పట్టుకుని బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

