📄 ePaper
Saturday, July 18, 2026
📄 ePaper
Homeతెలంగాణఅంబేద్కర్ విగ్రహా ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన నిరుడి దాస్

అంబేద్కర్ విగ్రహా ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన నిరుడి దాస్

📰 Generate e-Paper Clip

టేక్మాల్ ఏప్రిల్ 14: మన ప్రజావాణి మండల పరదిలోని వేల్పుగొండ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ముందు భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ నిరుడు దాసు హాజరయ్యారు. కుల మతాలకు అతీతంగా గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలవేసి జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కోసం కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ…, అంబేద్కర్ ఆశయాలను యువత ఆచరించాలని, కులమతాలకు అతీతంగా దేశ అభివృద్ధికి కృషి చేయాలని.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలోగ్రామ కార్యదర్శి రాఘవేందర్ ఉప సర్పంచ్ ఎంపీ సుధాకర్ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు, గ్రామ వార్డు సభ్యులు బేగరి చక్రపాణి, కొండా ఆనందం, గంధం దేవసాయం గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular