📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetఅందె గ్రామానికి రోడ్డు వేయించాలని మంత్రికి,వినతి పత్రం అందజేత..  

అందె గ్రామానికి రోడ్డు వేయించాలని మంత్రికి,వినతి పత్రం అందజేత..  

📰 Generate e-Paper Clip

అందె గ్రామానికి రోడ్డు వేయించాలని మంత్రిని కలిసిన గ్రామస్తులు.. రోడ్డు ప్రమాదాల నుండి కాపాడాలని,వినతి పత్రం అందజేత..

సిద్దిపేట్, మిరుదొడ్డి, జూన్ 11, ప్రజావాణి

మిరుదొడ్డి మండలంలోని మారుమూల ప్రాంతమైన అందె గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.భూంపల్లి-అక్బర్‌పేటలోని రామలింగేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రిని కలిసిన గ్రామస్తులు, గత ఎనిమిది నెలలుగా రోడ్డు మరమ్మతుల పేరుతో కంకర పరచి పనులను మధ్యలోనే నిలిపివేశారని వివరించారు. బీటీ రోడ్డు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని కాంట్రాక్టర్‌తో పాటు ఆర్&బీ అధికారులను అడిగితే డాంబర్ ధరలు పెరిగాయని సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కంకర రోడ్డుపై ప్రయాణించే ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుమారు 25 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారినా ఇప్పటివరకు సరైన మరమ్మతులు చేపట్టలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.అందె గ్రామం నుంచి మిరుదొడ్డి మండల కేంద్రానికి, సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా విద్యార్థులు విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వెంటనే బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని, మారుమూల గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అందె విలేజ్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అందె ప్రవీణ్, సాయిరెడ్డి,ఉప సర్పంచ్ పరశురాములు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular