అందె గ్రామానికి రోడ్డు వేయించాలని మంత్రికి,వినతి పత్రం అందజేత..  

అందె గ్రామానికి రోడ్డు వేయించాలని మంత్రిని కలిసిన గ్రామస్తులు.. రోడ్డు ప్రమాదాల నుండి కాపాడాలని,వినతి పత్రం అందజేత.. సిద్దిపేట్, మిరుదొడ్డి, జూన్ 11, ప్రజావాణి మిరుదొడ్డి మండలంలోని మారుమూల ప్రాంతమైన అందె గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.భూంపల్లి-అక్బర్‌పేటలోని రామలింగేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రిని కలిసిన గ్రామస్తులు, గత ఎనిమిది నెలలుగా రోడ్డు మరమ్మతుల పేరుతో కంకర పరచి పనులను మధ్యలోనే నిలిపివేశారని వివరించారు....