పోరుమామిళ్ల మే 17 ప్రజావాణి పోరుమామిళ్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ రవిబాబు, జిల్లా క్లస్టర్ మేనేజర్ భాస్కర్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వత్తు ల స్మారక దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో కొవ్వొత్తులు వెలిగించి మౌనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోరుమామిళ్ల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్య అధికార శివ కృష్ణ మాట్లాడుతూ ఎయిడ్స్ మృతుల ఆత్మ శాంతి కోసం మౌనం పాటించి నివాళులు అర్పించము . ప్రతి ఏడాది మే మూడవ ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, ఆరోగ్య విద్య అధికారి సాదు వెంకటేశ్వర్లు,ఐ సి టీ సి కౌన్సిలర్ పి. సునీల్, ఐ సి టీ సి ల్యాబ్ టెక్నీషన్ శ్రవణ్ కుమార్, దిశా లింక్ వర్కర్ యస్. ఖాదర్ బాషా, హాస్పిటల్ సిబ్బంది, సచివాలయ ఏ ఎన్ ఎం లు, సి హెచ్ ఓ లు, ప్రభుత్వ ఆసుపత్రి ఏ ఎన్ ఎం లు, ఆశ లు,మరియు ప్రజలు పాల్గొన్నారు.
అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం
RELATED ARTICLES


