📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgondaఅంగడిపేట గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

అంగడిపేట గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

*అంగడిపేట గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు*

*శ్రీ శ్రీ శ్రీ చింతాల ఆంజనేయ స్వామి దేవాలయం ను దర్శించుకున్న భక్తులు*

*ఆలయాలకు పోటెత్తిన భక్తులు,అన్న ప్రసాద వితరణ*

*చండూరు ప్రతినిధి (ప్రజావాణి)*

చండూరు మున్సిపాలిటీలో అంగడిపేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ చింతాల ఆంజనేయ స్వామి దేవాలయంలోని చింతాల ఆంజనేయస్వామి దేవాలయాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా సర్వాంగ సుందరంగా పూల మాలలతో,మామిడి తోరణాలతో అలంకరించారు.ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం లో అర్చకులు కమిటీ ఆధ్వర్యంలో, చండూరులో పెరుమాళ్ళ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు , నిర్వహించారు. హనుమాన్ కి అభిషేకం, అర్చనలు, పుష్పార్చన పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. జై హనుమాన్ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లింది. అన్న ప్రసాదం ప్రజలు స్వీకరించి హనుమాన్ ఆశీస్సులు పొందారు. విచ్చేసిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే వేసవి తాకిడిని తట్టుకునేందుకు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం దగ్గర చల్లని మజ్జిగ భక్తులకు అందచేసి దాహార్తిని తీర్చారు. విచ్చేసిన భక్తులు ఆలయ కమిటీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular