📄 ePaper
Friday, April 3, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetలక్ష్మిపూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహణ

లక్ష్మిపూర్ గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహణ

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, ఏప్రిల్ 2(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నిర్వహణలక్ష్మిపూర్ గ్రామ పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్పంచ్ ముక్కిస కవిత – రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ప్రత్యేక అధికారిగా సిసి యాదయ్య గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కవిత – రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే గ్రామస్తులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అనూష, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సదుద్దీన్, విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ మల్లయ్య, అంగన్వాడీ టీచర్ వెంకటలక్ష్మి, ఎన్‌ఎం వినోద్, ఉప సర్పంచ్ గంగాధర్ హరీష్, వార్డ్ సభ్యులు, సీఏలు, వీవోలు, ఆశా వర్కర్లు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular