📄 ePaper
Wednesday, April 1, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetనర్సింహులపల్లెలో రూ.10 లక్షలతో సిసి రోడ్డు పనులకు శ్రీకారం

నర్సింహులపల్లెలో రూ.10 లక్షలతో సిసి రోడ్డు పనులకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

నర్సింహులపల్లెలో రూ.10 లక్షలతో సిసి రోడ్డు పనులకు శ్రీకారం

బెజ్జంకి,ఏప్రిల్ 1(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని నర్సింహులపల్లె గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ జట్టి రమేష్, గ్రామ పంచాయితీ పాలకవర్గం,బెజ్జంకి మండల కాంగ్రెస్ నాయకులతో కలిసిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సుమారు రూ.10 లక్షల నిధులతో ఈ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ సిసి రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టి త్వరితంగా పూర్తి చేయాలని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని, ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు కుంట శ్రీనివాస్, జెట్టి అనిల్, కుంట రాజేశ్వరి, జంగపల్లి శ్రావణ్, గ్రామ పెద్దలు కౌడగాని శ్రీనివాస్, కుంట కనకయ్య, ప్రభాకర్, రాములు, సత్యం, తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కుంట హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular