📄 ePaper
Wednesday, April 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గత ప్రభుత్వంలో ఏ గ్రామంలోనైనా సిసి రోడ్డు వేశారా.

గత ప్రభుత్వంలో ఏ గ్రామంలోనైనా సిసి రోడ్డు వేశారా.

📰 Generate e-Paper Clip

గత ప్రభుత్వంలో ఏ గ్రామంలోనైనా సిసి రోడ్డు వేశారా..ప్రజావాణి న్యూస్ బద్వేల్ (మార్చి 30) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సిసి రోడ్డు వేసి గ్రామాలను అభివృద్ధి చేస్తుందని బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రరెడ్డి అన్నారు. మంగళవారం కలసపాడు మండలం చింతలపల్లి గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమ సభలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వంలో కనీసం ఒక్క గ్రామంలోనైనా సరైన సిసి రోడ్లు వేశార అని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 21 నెలల పాలనలో బద్వేల్ నియోజకవర్గంలో కేవలం సిసి రోడ్లకే 30 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది అన్నారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ ద్వారా రైతుల అభివృద్ధి కోసం అనేక అంశాలు ఉన్నాయన్నారు. పంట పండించే ప్రతి రైతు ఈక్రాప్ తప్పనిసరి చేసుకుంటే ఏదైనా అనుకోని విపత్తు గాలి వాన మొదలైన ఏవి వచ్చినా రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందుతుందన్నారు. అదే ఈ క్రాప్ చేసుకోకపోతే ఎటువంటి పరిహారం రాదు అని తెలిపారు. అదేవిధంగా మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేయాలన్న ఈక్రాప్ తప్పనిసరి అన్నారు. బయట దళారుల వద్ద అమ్మకాలు చేసి రైతులు నష్టపోవద్దని మార్కెట్ యార్డ్ లో మంచి గిట్టుబాటు ధరలు ప్రభుత్వం కల్పించిందన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.అనంతరం రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రంతు రవీంద్రారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular