సిద్దిపేట్ కమిషనరేట్‌లో పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు
బెజ్జంకి,మార్చి31(ప్రజావాణి)
సిద్దిపేట్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలంగా సేవలు అందించి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సింగీతం శంకర్ రావు కానిస్టేబుల్‌గా ప్రారంభించి,హెడ్ కానిస్టేబుల్, అనంతరం ఏఎస్సై స్థాయికి పదోన్నతులు పొందుతూ విశిష్ట సేవలు అందించారు.పదవీ విరమణ చేసిన అధికారులను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, అభినందించి,సన్మాన పత్రం, మెమెంటో అందజేసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,పోలీస్ శాఖలో వారు అంకితభావంతో పనిచేసి మంచి గుర్తింపు పొందినందుకు అభినందనలు తెలుపుతూ వారి సేవలను సిద్దిపేట్ పోలీస్ విభాగం ఎప్పటికీ మరువదని, అలాగే పదవీ విరమణ అనంతరం కూడా పోలీస్ కుటుంబ సభ్యులుగా ఎలాంటి అవసరం వచ్చినా సంప్రదించవచ్చని సీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్ & L&O) కుశాల్కర్,రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


