ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు
బెజ్జంకి, మార్చి 30(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామం వద్ద ప్రజల దాహార్తిని తీర్చేందుకు బెజ్జంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఏవో పాక మంజుల తన తల్లి జ్ఞాపకార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని మండల ఎంపీడీవో కడివెర్గు ప్రవీణ్, గ్రామ సర్పంచ్ రవళి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పలు గ్రామాల నుండి వందల సంఖ్యలో ప్రయాణికులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారని, వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.




