📄 ePaper
Sunday, March 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వై.యస్.జగన్ అమరావతికి వ్యతిరేకం కానే కాదు... అవినీతి, దోపిడి పైనే వ్యతిరేకం.

వై.యస్.జగన్ అమరావతికి వ్యతిరేకం కానే కాదు… అవినీతి, దోపిడి పైనే వ్యతిరేకం.

📰 Generate e-Paper Clip

ఖాజీపేటప్రజావాణి న్యూస్(మార్చి29)అమరావతి చట్టపద్ధత కల్పనపై తీర్మానం కాదు.వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడ.వైసీపీ అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ పగటి కలలు కనొద్దు. పయ్యావు కేశవ్జ.గన్ ను చరిత్రహీనుడనేందుకు సిగ్గుండాలి.దమ్ము ,ధైర్యముంటే అమరావతి పై కౌన్సిల్ ను సమావేశ పరచాలని సవాల్.వైయస్ జగన్ ను విమర్శించేందుకు,తిట్టేందుకేనా అసెంబ్లీ.ఇది బ్లాక్ డే.కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం ధ్వజం.ఖాజీపేట:అమరావతి రాజధానికి వైఎస్ఆర్సీపీ చీఫ్,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడు వ్యతిరేకం కానే కాదని అందుకే తాను అధికారంలోకి రాకమునుపే ఇక్కడ ఇళ్ళు,వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం కట్టుకున్నారని.రాజధాని పేరుతో అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు సర్కార్ చేస్తున్న అవినీతి, దోపిడికే వ్యతిరేకమని అమరావతిపై జగన్ పదేపదే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి అవసరం లేనే లేదని వైఎస్ఆర్ఎసీపీ రాష్ట్ర కార్యదర్శి,కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యo వెంకటసుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఖాజీపేట మండలం,దుంపలగట్టు గ్రామంలోని ఆయన స్వగృహంలో ఆదివారం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ.అమరావతికి చట్టబద్ధతపై తీర్మానం చేసేందుకు శనివారం అసెంబ్లీని సమావేశ పరచలేదని,కేవలం అన్నిరంగాలలో వైఫల్యాల నుంచి తప్పించుకునే ఎత్తుగడలో భాగమని ఆయన మండిపడ్డారు. అమరావతి పేరుతో ఎలా దోచుకున్నారో.దాచుకున్నారో.అనే దానిపై ఏడేళ్ళు చంద్రబాబు సర్కార్ అధికారంలో ఉండి కూడా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు చూపకపోవడంపై, రాజధాని పేరుతో చేసిన అప్పులపై,అమలుకాని సూపర్ సిక్స్ హామీలపై,కాంట్రాక్టులలో కమీషన్ల పై చర్చ జరగకుండా,అమరావతి చట్టబద్ధతపై గతంలోనే తీర్మానం చేశారని.అదే తీర్మానం చేసేందుకు మళ్లీ సమావేశాలు అవసరమా.అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.తమకు సంపూర్ణ మెజారిటీ ఉంది కదా అని అసెంబ్లీని సమావేశపరిచిన కూటమి ప్రభుత్వానికి దమ్ము,ధైర్యం,నీతి,నిజాయితీ,చిత్తశుద్ధి ఉంటే వైసీపీకి మెజారిటీ ఉన్న కౌన్సిల్ ను సమావేశపరిచాలని ఆయన సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వం వైఫల్యాలు,అవినీతి,దోపిడీ బయటపడుతుందనే కౌన్సిల్ ను సమావేశపరచలేదని ఇది ప్రభుత్వ నీచ రాజకీయానికి పరాకాష్ట అని ఆయన ఎద్దేవా చేశారు.అమరావతిని కొద్దిమంది కోసమే కట్టారని,ఇది ఉత్తరాంద్ర,రాయలసీమ వాసులు వచ్చి ఎలా స్థిరపడతారని,తెలుగు దేశం వారికి కోసమే అమరావతిని కడుతున్నారని కమ్యూనిస్టులతో కలిసి కూటమితో పొత్తులేనప్పుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చింతామని శ్రీరంగనీతులు చెప్పింది వాస్తవం కాదా? అని ఆయన నిలదీశారు.కానీ నేడు ఊసరవెల్లులు సిగ్గుపడేలా అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ అమరావతి రాష్ట్ర శాశ్వత రాజధానికి మనసా,వాచా,కర్మణా అమరావతికి సంపూర్ణ మద్దతునిస్తున్నానని అంటూ చిలుక పలుకులు పలకటం మీ ద్వంద నీతికి,రెండు నాల్కల దోరణికి ప్రత్యక్ష నిదర్శనం కాదా.అని ఆయన నిశితంగా విమర్శించారు.వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటూ.మళ్లీ వచ్చిన మమ్ములను ఏమి చేయలేదనటం పవన్ ఊగిసలాట దోరణికి,వైయస్ జగన్ అంటే భయానికి నిదర్శనం కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావటం,తిరిగి ముఖ్యమంత్రి కావటం సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో.అంతే వాస్తవమని ఆయన తేల్చిచెప్పారు.నీతి ,నిజాయితీ, చితశుద్ధితో చెప్పిన సంక్షేమ కార్యక్రమాల్ని,ఇచ్చిన వాగ్దానాల్ని నూటికి 95 శాతానికి మించి అమలు చేసిన సంక్షేమ సారధి,చరిత్ర పురుషుడు వైయస్ జగన్ ను మంత్రి పయ్యావుల కేశవ్ చరిత్రహీనుడు అనడానికి సిగ్గుండాలని.ఆయనది నోరా తాటి మట్టా అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.కేవలం జగన్ను విమర్శించేందుకు.తిట్టేందుకు.గోబెల్స్ కు మించి ప్రసారం చేసేందుకు అసెంబ్లీని పెట్టిన కూటమి నేతలు చరిత్రహీనులయ్యారని, ఇది రాష్ట్ర చరిత్రలో బ్ల్యాక్ డేగా ఆయన అభివర్ణించారు.ఏది ఏమైనా కేవలం అబద్ధాలతో,గోబెల్స్ ప్రచారాలతో,విషం చిమ్మటం ద్వారా వైఎస్ జగన్ ను రాష్ట్ర ప్రజల్లో చులకన చేయాలని అనుకుంటే మీరే చరిత్రహీనులుగా,ప్రజా ద్రోహులుగా ప్రజా,ప్రజా కంటకులుగా మిగిలిపోక తప్పదని రెడ్యo తీవ్రంగా హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular