ప్రజావాణిన్యూస్(మార్చి24)రాయచోటి లొ3వ రాష్ట్ర మహాసభల గోడపత్రాలు ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమానికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సుదర్శన్ రెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ డిస్కమ్ అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు ముఖ్య అతిధులు గా హాజరై గోడ పత్రాన్ని ఆవిష్కరించారు, అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ రంగ ప్రైవేటీకరణ దుష్ప్రభావాలు- సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల విలీనం లాభాలు” అనే అంశంపై సదస్సు జరుగుతుంది.కావున విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ హాజరై జయప్రదం చెయ్యాలని కోరారు.స్థలం: యు.టి.ఎఫ్ భవన్,ఎస్.వి.డిగ్రీ కాలేజీ దగ్గర,బాలాజీనగర్,కడప.తేది:8.4.2026,(బుధవారం) సమయం: ఉ॥ 10గం॥లకు జరుగుతుందన్నారు.ట్రాన్స్కో, జెన్కో,డిస్కంలలో పనిచేస్తున్న అన్నిరకాల విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు దశాబ్దాల తరబడి విద్యుత్ సంస్థను నమ్ముకొని ఎప్పటికైనా పర్మినెంట్ చేస్తారన్న ఆశతో బానిసలుగా పనిచేస్తున్నారు.కాని విద్యుత్ యాజమాన్యం,ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం,తరువాత మర్చిపోవడంతో మన బ్రతుకుల్లో ఎటువంటి మార్పు లేకుండా ఉంది. ఈ నేపధ్యంలో సిఐటియు, ఇఫీ ఫెడరేషన్ గా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తెలంగాణా తరహాలో సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని నికరంగా పోరాడుతుంది సిఐటియు యూనియన్ .కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పటికి కాంట్రాక్ట్ కార్మికులకు సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.పిఆర్సి ఇచ్చే సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరుగు తుంది .ఎరియర్స్,పెయిడ్లిడేస్,ఇన్సెంటీవ్లు సకాలంలో ఇవ్వడంలేదు.ఆన్ డ్యూటీ ప్రమాదాలు జరిగి మంచాన ఉన్నవారికి పూర్తి వైద్య సదుపాయం లేక జీవఛ్చావాలు లాగా బ్రతుకుతున్నారు.యాజమాన్యం,ప్రభుత్వం గాని పట్టించుకోవడంలేదు. కుటుంబాలను ఆదుకునే పరిస్థితిలేదు.ఒకే పనిచేసే వారికి రకరకాలుగా తక్కువ వేతనాలు ఇచ్చి వారి శ్రమని దోచుకుంటున్నారు.అదానీ,అంబానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు విద్యుత్ సంస్థలో అనేక విభాగాలను కట్టబెట్టడానికి కావాల్సిన ప్రైవేటీకరణ విధానాలను తెస్తున్నారు.స్మార్ట్ మీటర్ల వలన మీటర్ రీడర్స్, బిల్ కలెక్టర్స్,ఇంకా అనేక విభాగాలలో ఉపాధికోల్పోయే పరిస్థితి వచ్చింది.ఓపెన్ టెండర్ విధానాల వలన స్టోర్ హమాలీస్ తమ ఆదాయాన్ని కోల్పోయారు.ఈ నేపధ్యంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ మరియు పీస్ రే ట్ రకరకాల పేర్లతో పనిచేస్తున్న కార్మికుల్ని సంస్థలో విలీనం చేసి రెగ్యులరైజ్ చెయ్యాలని అప్పటి వరకు కనీసవేతనం రూ.46 వేలు ఇవ్వాలని కోరుతున్నాము,అంతేకాక రిటైర్మెంట్ బెనిఫిట్10లక్షలు,అన్లిమిటెడ్ హెల్త్ కార్డులు,కోటి రూపాయలు ఇన్సూరెన్స్,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలి.పీస్ రేట్ కార్మికులకు, స్టోర్ హమాలీస్కు కనీస వేతనాలు అమలుచేయాలి.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే విధానాలను నిలిపివేసి ప్రజల ఆస్తులను కాపాడటం,అదానీ,అంబానీ,షిర్డీ సాయి కంపెనీ లతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలి.కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలొ విలీనం చేసి విద్యుత్ యాజమాన్యమే ప్రత్యక్ష బాధ్యత చేపట్టాలి.2026 ఏప్రిల్ 8వ తేదీ (బుధవారం) కడపలో జరిగే మహాసభలకు విద్యుత్ అన్ని విభాగాల కాంటాక్ట్ కార్మికులు,తదితర అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొనాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాయచోటి డివిజన్ కార్యదర్శి డి. శ్రీనివాసులు రెడ్డి,అధ్యక్షులు జి.నాగేష్ గౌడ్, డివిజన్ నాయకులు రామాజులు,గజ,నాగేశ్వరావు,ప్రసాద్,పి. వి.ర్ రెడ్డి,మల్లరెడ్డి, గ్రేడ్ నాయకులు రెడ్డి రాజు మరియు రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు.తదితరులు పాల్గొన్నారు
Homeఆంధ్రప్రదేశ్యునైటెడ్ ఎలక్ట్రిసిటి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి.
యునైటెడ్ ఎలక్ట్రిసిటి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి.
0
14
Next article
- Advertisment -



