📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఇటుకలపాడు సర్వేనెంబర్ 458 ప్రభుత్వ భూమిని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన వీఆర్వో తాసిల్దార్ పై విచారించాలి*

ఇటుకలపాడు సర్వేనెంబర్ 458 ప్రభుత్వ భూమిని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన వీఆర్వో తాసిల్దార్ పై విచారించాలి*

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్ మార్చి23ఇటుకలపాడు సర్వేనెంబర్ 458 ప్రభుత్వ భూమిని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన వీఆర్వో తాసిల్దార్ పై విచారించాలిఅ క్కంగుండ్ల రెవెన్యూ పొలం పై విచారించిన గోపవరం తాసిల్దారు వేదికను విడుదల చేయాలి*నాయన పల్లె రెవెన్యూ పొలం సర్వేనెంబర్ 217 230 231 భూ కబ్జాదారుడు నల్ల సత్యం పై కేసు నమోదు చేయాలి*కత్తెర గండ్ల రెవెన్యూ పొలం 2227లో ఆకుల నారాయణపల్లె పేదలు కు సబ్ డివిజన్ చేసి పట్టాలి ఇవ్వాలి* కాశి నాయన మండల పరిధిలో అక్యంగుండ్ల రెవిన్యూ గ్రామం ఏండ్ల తరబడి పేదలు సాగులో ఉన్న ప్రభుత్వ భూములు సావిశెట్టిపల్లె కేఎన్ కొట్టాల ఆకుల నారాయణపల్లె మిద్దెల గ్రామల చెందిన నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ ఎంబడి పోలయ్య జకరయ్య వెంకటేష్ డిమాండ్ చేశారు సోమవారం ఉదయం బద్వేల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట వరి కుంట్ల నాయన పల్లె ఆకుల నారాయణపల్లె కేఎన్ కొట్టాల మిద్దెల సావిశెట్టిపల్లె తదితర గ్రామాలకు చెందిన భూమిలేని నిరుపేదలు సాగులో ఉన్న పేదలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ ఎంబడి పోలయ్య కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జకరయ్య వెంకటేష్ మాట్లాడుతూ ఇటికలపాడు రెవెన్యూ గ్రామం సర్వేనెంబర్ 458 లో 18 ఎకరాల 40 సెంట్లు ప్రభుత్వ భూమిని 2019 సంవత్సరం స్థానిక వీఆర్వో వేణు గోపాల్ ఇన్చార్జి తాసిల్దారు సుధీర్ ఇద్దరు కలిసి ప్రకాశం జిల్లా సి ఎస్ పురం మండలం చిన్నపనాయన పల్లె గ్రామానికి చెందిన యనమల రాములు అను ఆమె పేరుతో ఆన్లైన్ చేసి సబ్ రిజిస్ట్రేషన్ లో రిజిస్ట్రేషన్ చేసి ఇటుకలపాడు గ్రామానికి చెందిన సుభ రాజేశ్వరరావు కు అమ్మారు ఆ భూమి ఆర్ హెచ్ లో ఈసీ లో ప్రభుత్వ భూమిగా నమోదైనది అన్నారు కాబట్టి వెంటనే వీఆర్వో వేణుగోపాల్ ఉప తాసిల్దార్ అయిన సుధీర్ పై విచారించి చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారునాయన పల్లె రెవెన్యూ పొలం సర్వేనెంబర్ 217 230 231 ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సమీప బంధువైన సత్యనారాయణ రెడ్డి

అలియాస్ నల్ల సత్యం వరికుంట్ల నిరుపేదల భూములు పత్రికా విలేకరుల సాగులో ఉన్న భూములను దౌర్జన్యంగా వైసీపీ ప్రభుత్వంలో 200 ఎకరాలు సాగు చేసి జలకల పథకం కింద బోర్లు వేయించు కొన్నారు కరెంటు ట్రాన్స్ఫారాలు బిగించుకొని అరిటి జొన్న తదితర పంటలు సాగు చేస్తున్నాడు,ఆ భూములను గతంలో జాయింట్ కలెక్టర్ అద్విసింగ్ ఆర్డిఓ చంద్రమోహన్ పరిశీలించి ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేశారు కానీ యధావిధిగా పంటలు సాగు చేస్తున్నాడు ఇప్పటివరకు ఆ భూములను స్వాధీనం చేసుకోలేకపోతున్నారు వెంటనే స్వాధీనం చేసుకొని వరికుంట్ల నాయన పల్లె భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ అమలు చేయాలని కోరారు కత్తెర గండ్ల రెవెన్యూ పొలం 2227 లో 80 ఎకరాలు ప్రభుత్వ భూమి ఐదు సంవత్సరాల నుంచి జెసిబి లు ట్రాక్టర్లు యంత్రాలతో ఆకుల నారాయణపల్లె గ్రామం నిరుపేదలు ఎకరం చొప్పున సాగు చేసిన భూములకు పట్టాలు సబ్ డివిజన్ అమలు చేయాలని తెలిపారు,మిద్దెల గ్రామం దళిత కుటుంబాలకు చెందిన నాలుగు ఎకరాల 8 సెంట్లు స్మశానం భూమిని స్థానిక అగ్రవర్ణాలు ఆక్రమించుకున్నారు ఆ భూమిని దళితులకు స్వాధీనం చేసి స్మశానానికి పహారి గోడ తో పాటు స్మశానానికి పోవటానికి దారి ఏర్పాటు చేయాలని ఆర్డీవో చంద్రమోహన్ కు వినతి పత్రం సమర్పించారుఈ  ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కాశినాయన మండల అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ కుమార్ వరుకుంట్ల బాబు మిద్దెల ఓబయ్య జయరాం సుధాకర్ శ్రీను ఆవాజ్ జిల్లా కార్యదర్శి చాంద్బాషా అట్లూరు మండల కార్యదర్శి ఈ రమణయ్య చంద్ర తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.