ప్రజావాణిన్యూస్(మార్చి21)పోరుమామిళ్ల పట్టణంలోని పొట్టి శ్రీరాములు వీధిలో నూతనంగా మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులను శనివారం బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సీతా వెంకటసుబ్బయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు టెంకాయ కొట్టి మరమత్తు పనులను ప్రారంభించారు.అనంతరం వారిని టిడిపి నాయకుడు గాలి మురళి ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో సత్కరించారు.వారు మాట్లాడుతూ.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి వీధి సస్యశ్యామలంగా ఉండాలని ఉద్దేశంతో నూతన సీసీ రోడ్డులను మంజూరు చేసిందన్నారు.ప్రజాభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిహిమామ్ హుస్సేన్,గాలి మురళి,శంకర్ రెడ్డి, జనార్ధన్,ప్రొఫెసర్ భాష,మౌలాలి,నాగరాజు శెట్టి, టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు
Homeఆంధ్రప్రదేశ్సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి
0
12




