📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarముల్కనూరులో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం

ముల్కనూరులో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం

📰 Generate e-Paper Clip

🟨 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ – రాశిఫలాలు వినిపించిన పండితులు

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రోజున పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిమిర్యాల రామకృష్ణ చారి, శిబిరాల వంశీకృష్ణ అయ్యగారు పంచాంగాన్ని వినిపించారు.ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాడి పంటలు, వర్షపాతం, ధరల పెరుగుదల వంటి అంశాలతో పాటు 12 రాశులపై ప్రభావం, ఫలితాలను వివరించారు. అనంతరం భక్తులు తమ తమ రాశుల ఫలితాలను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని పంపిణీ చేసి, పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జేపీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముప్పిడి జయ ప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, మాజీ ఎంపిటిసి పెసరీ రాజేశం, వార్డు సభ్యులు గట్టు రేణుక, మహమ్మద్ రజాక్, జెట్టి లత, మర్రి విజయలక్ష్మి, పంది పెళ్లి కీర్తన, వంగల రాము, పిట్టల తిరుపతి, ఇరుకుల్ల సృపిత్ తదితరులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular