📄 ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamతిరుమలాయపాలెం మండలానికి చెందిన ఉన్నం రాజశేఖర్‌కు జిల్లా కార్యదర్శి పదవి.

తిరుమలాయపాలెం మండలానికి చెందిన ఉన్నం రాజశేఖర్‌కు జిల్లా కార్యదర్శి పదవి.

📰 Generate e-Paper Clip

ఉన్నం రాజశేఖర్‌కు కాంగ్రెస్‌లో కీలక పదవి.

పార్టీ సేవలకు గుర్తింపుగా జిల్లా కార్యదర్శి బాధ్యతలు

స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర

మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి కొనసాగింపు

తిరుమలాయపాలెం,ప్రజావాణి:   

తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ఉన్నం రాజశేఖర్‌ను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం అధికారిక ఆదేశాలు జారీ చేశారు.పార్టీని నమ్ముకుని అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, గ్రామంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను సొంత ఖర్చులతో నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి విశేషంగా తోడ్పడినందుకు ఆయనకు ఈ పదవి లభించింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దళిత మహిళ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేసినట్టు నాయకులు తెలిపారు.మండలంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్న ఉన్నం రాజశేఖర్‌ను పార్టీ గుర్తించి జిల్లా కార్యదర్శిగా నియమించడం పట్ల మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular