📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్తప్పుడు కేసులు పెడుతున్న కాశినాయన ఎస్ఐ యోగేంద్ర ను సస్పెండ్ చేయాలి సీపీఎం

తప్పుడు కేసులు పెడుతున్న కాశినాయన ఎస్ఐ యోగేంద్ర ను సస్పెండ్ చేయాలి సీపీఎం

📰 Generate e-Paper Clip

  • తప్పుడు కేసులు పెడుతున్న కాశినాయన ఎస్ఐ యోగేంద్ర ను సస్పెండ్ చేయాలి

ప్రభుత్వ భూముల్లో భూకబ్జా దారులు వేస్తున్న బోర్లకు పోలీసులు కాపలా పెట్టి బోర్లు వేయించిన ఎస్సై యోగేంద్రను సస్పెండ్ చేయాలి సిపిఎం కాశినాయన మండలం ఇటికలపాడు రెవెన్యూ గ్రామం సర్వేనెంబర్ 458 లో 18 ఎకరాల 40 సెంట్లు ప్రభుత్వ భూమిలో భూ కబ్జాదారులు అక్రమంగా దున్ని తాసిల్దార్ అనుమతి లేకుండా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి బోర్లు వేసే వారికి పోలీసులను కాపలా పెట్టటం స్థానిక మాజీ సర్పంచ్ ఆదినారాయణరెడ్డి గ్రామస్తులును వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంబడి పోలయ్య 9 మందిపై కాశినాయన మండలం ఎస్సై యోగేంద్ర యాదవ్ కేసు నమోదు చేయటం దుర్మార్గం వెంటనే జిల్లా పోలీసు ఉన్నత అధికారులు విచారించి సస్పెండ్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ మాట్లాడుతూ 2019 సంవత్సరంలో కాశి నాయన మండలం ఇటుకలపాడు గ్రామం వీఆర్వో వేణుగోపాల్ యాదవ్ ఇన్చార్జి తాసిల్దారు సుధీర్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రకాశం జిల్లా సి ఎస్ పురం మండలం చిన్నప్ప నారాయణ పల్లె గ్రామానికి చెందిన యనమల రాములమ్మ భర్త పెద్ద వెంకటసుబ్బయ్య పేరుతో 18 ఎకరాల 40 సెంట్లు తప్పుడు పద్ధతిలో దొంగ పాసు బుక్స్ సృష్టించి అడంగల్ లో బోగస్ ఖాతా నెంబర్ వేసి ఇన్చార్జి తాసిల్దారుగా ఉన్న సుధీర్ యాదవ్ తో ఆన్లైన్ నమోదు చేశారు. అనంతరం బద్వేలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా సి ఎస్ పురం మండలం చిన్నపనాయన పల్లె గ్రామానికి చెందిన యనమల రాములమ్మ భర్త వెంకటసుబ్బయ్య పేరుతో రిజిస్ట్రేషన్ నమోదు చేశారు అనంతరం ఇటుకలపాడు గ్రామం చెందిన గంజికుంట సుభరాజేశ్వరరావు వారి భార్య రాజేశ్వరమ్మ ఇద్దరు పేర్లతో 18 ఎకరాల 40 సెంట్లు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసి 40 లక్షల రూపాయలకు వీఆర్వో వేణుగోపాల్ యాదవ్ ఆ భూమిని అమ్మి నాడు. అదేవిధంగా వారంతట వారే గంజికుంట రాజేష్ రావు బద్వేలు కోర్టులో సీల్ కేసు వేసి తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుని భూమిని సాగు చేయడటం తాసిల్దారు అనుమతి లేకుండా ఎన్వోసీ లేకుండా బోర్లు వేయటం ఆ బోర్లకు ఎస్ఐ యోగేంద్ర యాదవ్ కానిస్టేబుల్ కాపలా పెట్టటం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ భూమిని దౌర్జన్యంగా సాగు చేస్తున్నారని స్థానిక ఇటుకలపాడు మాజీ గ్రామ సర్పంచ్ కొప్పల ఆదినారాయణ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంబడి పోలయ్య సర్వేనెంబర్ 458 ఆర్ ఎస్ ఆర్ లో పేర్లు ఉన్న ఆకుల ఓబులేషు తండ్రి పెంచలయ్యతో పాటు తొమ్మిది మందిపై తప్పుడు కేసు ఎస్సై యోగేంద్ర యాదవ్ నమోదు చేశారు.సోమవారం కడప కలెక్టరేట్ స్పందన క్లినిక్ లో ఇటుకలపాడు సర్వేనెంబర్ 458 పై సమగ్ర విచారణ జరపాలని తప్పుడు పద్ధతిలో ఆన్లైన్ చేసిన వీఆర్వో తాసిల్దార్లపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం ఫిర్యాదు చేశారు బద్వేల్ ఆర్డీవో కు విచారణకు పంపించారు. కాశినాయన మండలం ఎస్సై యోగేంద్ర యాదవ్ భూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ స్థానికులు దళితులపై కేసులు నమోదు చేయటం సరైనది కాదని జిల్లా పోలీస్ ఉన్నత అధికారులకు వ్యవసాయ కార్మిక సంఘం ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారు మైదుకురు డిఎస్పీ విచారించాలని పోలీసు ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు అని తెలిపారు సమగ్రంగా విచారించాలని ఈ నెల 23వ తేదీ ఆర్డీవో కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు రఘు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.