📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జాతీయ స్తాయి కరాటే పోటీలలో ఘన విజయం సాదించిన గిద్దలూరు సంజీవిని స్వచ్చంద సేవ సంస్థ...

జాతీయ స్తాయి కరాటే పోటీలలో ఘన విజయం సాదించిన గిద్దలూరు సంజీవిని స్వచ్చంద సేవ సంస్థ విద్యార్ధులు

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి10)మార్కాపురం జిల్లా గిద్దలూరు తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15వ తేదీ షాద్ నగర్ పట్టణంలో జాతీయ స్తాయి కరాటే కుంగ్ ఫూ ఛాంపియన్ షిప్ పోటీలలో పి.ర్ కాలనీ సంజీవిని ఎడ్యుకేషన్ గురుకుల స్వచ్ఛంద సేవ సంస్థ ఆశ్రమంలో ఉంటూ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అద్భుత ప్రతిభను ప్రదర్శించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు షాద్ నగర్ పట్నంలో ఠాగూర్ విద్యానికేతన్ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కరాటే కుంగ్ ఫూ విద్యార్థులు 750 మంది బాల బాలికలు పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినిమా హీరో రమాకాంత్ న్యూ పవర్ కుంగ్ ఫూ తెలంగాణ డైరెక్టర్ ఎస్.బాలరాజు ముదిరాజ్,చరణ్ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ కిన్నెర రవి మరియు ముక్య అతిధులు అందరు పాల్గొన్నారు గిద్దలూరు సంజీవిని సేవా సంస్థ విద్యార్థులు కటాస్ ఫైట్ విభాగాలలో పోటీపడి ఆరు గోల్డ్ మెడల్స్ మరియు రెండు సిల్వర్ మెడల్స్ సాధించి ఘనవిజయం అందుకున్నారు.ఈ విజయం వెనుక అసలైన కథ మరింత ఆదర్శప్రాయ మైనది గిద్దలూరు పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఓబులాపురం రాజశేఖర్ తన జీవిత కష్టాలను పక్కనపెట్టి నిరుపేద విద్యార్థులను చేరదీసి ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో సంజీవిని ఎడ్యుకేషన్ గురుకుల స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించడం జరిగినది తాను చదువుకోలేకపోయినా పదిమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు సంజీవిని ఆశ్రమంలో నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లి లేక,తండ్రి లేక,తల్లిదండ్రులు లేకపోయిన విద్యార్థులను చేరదీసి అమ్మ,నాన్న,అన్న,అన్ని తానై ఉచిత విద్య మరియు వసతి ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల నుండి నిత్యం ఇలాంటి వారందరికి ఉచితంగా సేవలు అందిస్తున్నారు నిస్వార్ధం నిండిన  సహాయం చేయాలనే గొప్ప మనస్సు ఉన్న,సంపాదించే సంపద కాదు ఇలాంటి వారిని ఆదుకుని,కాపాడి చిన్న పెద్ద వారి అందరి దీవెనలు కోసం పూరడుతున్న ఓబులాపురం రాజశేఖర్ గారు బూత రాజు శ్రీనివాస్ కరాటి మాస్టర్ మాట్లాడుతూ సంజీవిని ఆశ్రమం నుండి విద్యార్థులకు అన్ని వసతులు తో కూడినటువంటి ఆశ్రమం నాకు మంచి అవకాశం కల్పించారు విద్యార్థులకు ఉచితముగా కరాటే శిక్షణ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఇప్పుడు రెండవసారి మన ఆశ్రమం విద్యార్థులు ఘనవిజయం సాధించారు రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలు అందించాలని కరాటే మాస్టర్ గౌరవనీయులు బూతరాజు శ్రీనివాస్ గారు తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ కుమార్,డాక్టర్ ఉమా,సుశీల,పి ఆర్ కాలనీ ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయ బృందం,అంబవరం విజయకుమార్ సాఫ్ట్ వేర్ మరియు గుండ్ల నాగార్జున గౌడ్ గారు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి దాతకు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.