ప్రజావాణిన్యూస్(మార్చి15)విజయవాడలో ఆంధ్ర యాదవుల దళం.బంతిపూల వర్షంతో స్వాగతం.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి సన్మాన సభ విజయవంతం.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి.నవీన్ యాదవ్ గారు తొలిసారిగా విజయవాడ నగరానికి విచ్చేయగా.గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సుమారు 100 పైగా కార్ల భారీ ర్యాలీతో యాదవ ఐక్యవేదిక సంఘాల నాయకులు ఆయనను తీసుకువచ్చారు.ఈ సందర్భంగా మార్గమధ్యంలో గజమాలలు వేసి,బంతిపూల వర్షంతో నవీన్ యాదవ్ గారిని అభిమానులు, యాదవ సంఘాల నాయకులు ఆత్మీయంగా ఆహ్వానించారు.తనకు సన్మాన సభను ఏర్పాటు చేసిన యాదవ ఐక్యవేదిక సంఘాల నాయకులకు ఎమ్మెల్యే గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.యాదవ సమాజం ఎప్పుడూ ఐక్యంగా ఉండి పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.విద్య,ఐక్యత,సేవాభావంతో యాదవులు మరింత ఎదిగి సమాజంలో ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.తన తండ్రి శ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ గారు ప్రజాసేవ చేస్తుండగా ఎన్నో కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు.పదవి లేకపోయినా కూడా మా నాన్నగారు ప్రజలకు ఎప్పుడూ ముందుండి సహాయం చేసేవారని గుర్తు చేశారు.మా కుటుంబం నుంచి సహాయం పొందిన లక్షలాది మంది చేసిన ప్రార్థనలు,అలాగే శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు.నా తండ్రి కలను సాకారం చేయుటకు రాజకీయాల్లోకి వచ్చిన నన్ను గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.యాదవ కమ్యూనిటీని మరింత బలపరచడానికి నేను నిరంతరం కృషి చేస్తానని అన్నారు.ఒకప్పుడు ప్రజాసేవలో చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఎలా ముందుండేవారో,ఇప్పుడు కూడా మీ తమ్ముడు నవీన్ యాదవ్ కూడా అదే మార్గంలో ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్* గారి అడుగుతో దద్దరిల్లిన బెజవాడ..
0
16
Next article
- Advertisment -



