📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamసంక్షేమ హాస్టల్లో హాస్పిటల్స్ కు వినియోగదారులకు గ్యాస్ కొరత లేదంటూ ప్రకటనలు  ...

సంక్షేమ హాస్టల్లో హాస్పిటల్స్ కు వినియోగదారులకు గ్యాస్ కొరత లేదంటూ ప్రకటనలు  మధిర నియోజకవర్గం మధిర పట్టణంలో ఓ గ్యాస్ ఏజెన్సీ సరఫరాకు దోబూచులాట..

📰 Generate e-Paper Clip

సంక్షేమ హాస్టల్లో హాస్పిటల్స్ కు వినియోగదారులకు గ్యాస్ కొరత లేదంటూ ప్రకటనలు

 

మధిర నియోజకవర్గం మధిర పట్టణంలో ఓ గ్యాస్ ఏజెన్సీ సరఫరాకు దోబూచులాట..

 

బోనకల్ సంక్షేమ హాస్టల్ కు గ్యాస్ సరఫరాకు గత మూడు రోజులుగా కొర్రీలు

 

లేఖలు అందజేసిన సరఫరా చేయని వైనం

 

 

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 

గ్యాస్ సఫరాలో కృత్రిమ కొరత సృష్టించకుండా వినియోగదారులకు ప్రధానంగా సంక్షేమ హాస్టల్స్ హాస్పిటల్స్ గృహ వినియోగదారులకు ఎటువంటి అదనపు భారం పడకుండా గ్యాస్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ మేరకు ఆయా జిల్లాలలో సమీక్ష సమావేశాలు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటారని నేపథ్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మధిర పట్నంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ బోనకల్ సంక్షేమ హాస్టల్ కు గ్యాస్ కొరత ఉన్నదని సంబంధిత హాస్టల్ వార్డెన్ పలుమార్లు లేఖలు అందజేసినప్పటికీ వ్యాసు సరఫరా చేసేందుకు సదరు ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నట్లు పలువురు తల్లిదండ్రులు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మూడుసార్లు లేఖలు అందజేసినట్లు సంబంధిత హాస్టల్ వార్డెన్ వివరణ ఇచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సంక్షేమ హాస్టల్ కు గ్యాస్ సరఫరాచేసేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

మరి కొన్ని పూర్తి వివరాలతో.. జిల్లాలో గ్యాస్ సరఫరా తీరుపై రేపటి కథనం..2లో వేచి చూడండి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.