కొమ్ము రమేష్‌కు ఉగాది పురస్కారం–2026
తిరుమలాయపాలెం, ప్రజావాణి, మార్చి 11:
ఉగాది పండుగను పురస్కరించుకుని రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు స్వర మధురిమ కల్చరల్ సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో ఘనంగా పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన కవులు, గాయకులు, కళాకారులు, విద్యావేత్తలు, అలాగే భరతనాట్యం, కూచిపూడి నృత్య రంగాల్లో ప్రావీణ్యం సాధించిన కళాకారులను ఈ సందర్భంగా సత్కరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు “నారీశక్తి అవార్డులు”, ఉగాది పండుగ సందర్భంగా విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి “ఉగాది పురస్కారాలు” అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఈసనపల్లి నగేష్, భవిష్య విద్యాసంస్థల అధినేత రామ్ రెడ్డి, వివి రెడ్డి సంగీత నాట్యాలయం రమణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా కళాకారుడు కొమ్ము రమేష్ కు శాలువా, మెమెంటో, సర్టిఫికేట్ అందజేసి “కళా రత్న” బిరుదుతో ఉగాది పురస్కారం–2026 ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కొమ్ము రమేష్ మాట్లాడుతూ, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కొమ్ము రమేష్‌కు ఉగాది పురస్కారం రావడం పట్ల కవులు, కళాకారులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మరియు కళాపోషకులు హర్షం వ్యక్తం చేశారు.



