సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి
కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అన్నం, గుడ్డు, పాలకూర పప్పు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లను పరిశీలించారు. పాలకూర పప్పు పలుచగా ఉండటం చూసి అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో పాలకూర పప్పు ఇంత పల్చగా వండుతారా అని వంట సిబ్బందిపై మండి పడ్డారు. మెనూ పాటిస్తున్న కూరలు నాణ్యతతో ఉండాలని ఇష్టానుసారంగా ఏదో మొక్కుబడిగా వంట చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.పాఠశాల విద్యార్థులకు మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం కోసమే ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పలు రకాల కూరగాయలను కూడిన భోజనాన్ని పెడుతుందని మధ్యాహ్నం భోజన లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీలో పిల్లలకు గర్భిణీ స్త్రీలకు బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టాలని ఆకుకూరల్లో మునగా ఆకు వాడాలని అంగన్వాడీ టీచర్ ను ఆదేశించారు. పిల్లలతో ఆప్యాయంగా పలకరిస్తూ ఏం తిన్నారు భోజనం ఎలా ఉందనీ అడగ్గ గుడ్డు అన్నం తిన్నామని పిల్లలు కలెక్టర్ కి తెలిపారు.అ
నంతరం మండలంలోని తంగళ్లపల్లి గ్రామం లో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. ఆహార పదార్థాలు తనికి చేస్తూ రోజు కామన్ డైట్ మెనూ పాటిస్తూ రుచికరంగా వండాలని, విద్యార్థులకు భోజనం, వసతి, చదువు విషయం లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు.




