జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రాన్ని :జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మిక తనిఖీ..

సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అన్నం, గుడ్డు, పాలకూర పప్పు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లను పరిశీలించారు. పాలకూర పప్పు పలుచగా ఉండటం చూసి అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో పాలకూర పప్పు ఇంత పల్చగా వండుతారా అని వంట సిబ్బందిపై మండి పడ్డారు....