ప్రజావాణి న్యూస్:(మార్చి 11) కలసపాడు మండలం ఎగువ తంబళ్లపల్లె ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల వార్షికోత్సవాన్ని ప్రధానోపాధ్యాయుడు రవి క్రీస్తు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్లస్టర్ చైర్మన్ మెర్సీ మాలిని, ఏఈటిఎఫ్ ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, గ్రామస్తులు వెంకటేశ్వర ఆచారి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సుభాషిణి లు హాజరయ్యారు. ఈ సమావేశంలో వెంకటేశ్వర ఆచారి 12వేల విలువచేసే సౌండ్ బాక్స్ ప్రింటర్ ను పాఠశాలకు విరాళంగా అందించారు. ఆయనను ఉపాధ్యాయుడు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పిస్తే వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను బోధిస్తున్నామన్నారు. కావున ఈ అవకాశాన్ని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. అనంతరం విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి, రమణారెడ్డి,పార్వతి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
0
14
RELATED ARTICLES
- Advertisment -




