📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetపాములపర్తి విద్యానగర్ అంగన్వాడీ 1కేంద్రంలో అన్నప్రాసన, శ్రీమంతాలు కార్యక్రమం..

పాములపర్తి విద్యానగర్ అంగన్వాడీ 1కేంద్రంలో అన్నప్రాసన, శ్రీమంతాలు కార్యక్రమం..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి విద్యానగర్ అంగన్వాడీ 1వ కేంద్రంలో బుధవారం అన్నప్రాసన, శ్రీమంతాలు, కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భావని, బాలకిషన్, ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు ఆశీస్సులు అందజేశారు. ఉపసర్పంచ్ జుట్టు సుధాకర్, పాల్గొని గర్భిణీ స్త్రీలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వార్డ్ సభ్యులు నీరుడి రాజు, కొండని లక్ష్మి, దండు కరుణాకర్, కొండని నరేష్,మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల పోషణ, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ జై బునిసా , ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు హెచ్ ఎం సంధ్యారాణి,ప్రత్యూష,గర్భిణీ స్త్రీలు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular