ప్రజావాణి న్యూస్:(మార్చి 10)ప్రొద్దుటూరు కబ్జాల గడ్డ బద్వేల్ అడ్డా అన్న పాత మాటలకు కాలం చెల్లింది.ఇప్పుడు ప్రొద్దుటూరు కబ్జాదారులు మాకంటే తోపులు ఎవరున్నారబ్బా. అంటూ సవాళ్లు విసురుతున్నారు.అటవీ భూమి అని చూడకుండా పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమి అని లెక్కచేయకుండా.కంటికి కనిపిస్తే చాలు కబ్జా కొట్టాల్సిందే అని దళారులు రెచ్చిపోతున్నారు.ఇప్పటికే ఫారెస్ట్ ల్యాండ్‌ను నిలువునా నమిలేసిన ఈ అక్రమార్కులు.ఇప్పుడు పారిశ్రామిక భూములపై పంజా విసిరి రాబందుల్లా వాలుతున్నారు.సామాన్యుడి సొంతింటి కల.దళారుల జేబుల్లో కాసులు.అన్నం పుణ్యం ఎరుగని అమాయకపు ప్రొద్దుటూరు జనాన్ని ఈ భూబకాసురులు నిలువునా నట్టేట ముంచుతున్నారు.రండి బాబు రండి.మా దగ్గర అదిరిపోయే ప్లాట్లు ఉన్నాయి.తూర్పు ముఖం ప్లాట్ అయితే 45 లక్షలే.పడమర ముఖం అయితే కేవలం 35 లక్షలకే ఇస్తాం అంటూ మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు.పట్టణంలో ఇళ్ల స్థలం దొరకడమే కష్టమనుకుంటున్న మధ్యతరగతి జనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దళారులు పక్కా స్కెచ్ వేస్తున్నారు.రిజిస్ట్రేషన్ గారడీ.జీవోల ముసుగులో దగా.
ఈ దళారుల లెక్కలే వేరు.అయ్యా.రెండు సెంట్లు అయితే రిజిస్టర్ కాదు పది సెంట్లు కొంటేనే అవుతుంది.. మీకేం భయం లేదు మేమంతా ఉన్నాం కదా ప్రస్తుతానికి అగ్రిమెంట్ రాపిస్తాం అని నమ్మబలుకుతున్నారు.అంతటితో ఆగకుండా త్వరలోనే మా ప్రజాప్రతినిధి ఒక కొత్త జీవో తెస్తున్నాడు అప్పుడు పక్కా రిజిస్ట్రేషన్ అవుతుంది అని పచ్చి అబద్ధాలతో జనాల నెత్తిన నిప్పులు పోస్తున్నారు.. ప్రభుత్వ భూములను పరిశ్రమల కోసం కేటాయించిన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెడతారన్న కనీస జ్ఞానం కూడా లేకుండా సామాన్యులను వంచిస్తున్నారు.ఆ.ప్రజాప్రతినిధి.ఎవరు.ప్రభుత్వభూములను కొల్లగొడుతూ సామాన్యుల రక్తాన్ని తాగుతున్న ఈ దళారులకు అండగా నిలుస్తున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరు. అక్రమ భూములను సక్రమం చేస్తామంటూ ఏ ధైర్యంతో జీవోల పేరు చెబుతున్నారు.ఇప్పుడిదే ప్రొద్దుటూరు వీధుల్లో చర్చనీయాంశంగా మారింది.అసలు చట్టానికి లోబడి పని చేయాల్సిన ప్రతినిధులు ఎలా కబ్జాదారులకు కొమ్ముకాస్తుంటే ఇక సామాన్యుడికి దిక్కెవరు.ప్రొద్దుటూరు ప్రజలకు ముఖ్య గమనికప్రభుత్వం కేటాయించిన ఇండస్ట్రియల్ భూములు గానీ,ఫారెస్ట్ భూములు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ కావు.దళారులు చెప్పే అగ్రిమెంట్లు చట్టబద్ధం కావు.అప్పనంగా వచ్చే జీవోలు ఏవీ ఉండవు.కాబట్టి.కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇలాంటి కబ్జాదారుల పాలు చేసి మోసపోవద్దని బాధితులు హెచ్చరిస్తున్నారు.


