ప్రొద్దుటూరు గడ్డపై..భూ..దహనం కబ్జాకోరుల కోరల్లో పారిశ్రామిక అటవీ భూములు..
ప్రజావాణి న్యూస్:(మార్చి 10)ప్రొద్దుటూరు కబ్జాల గడ్డ బద్వేల్ అడ్డా అన్న పాత మాటలకు కాలం చెల్లింది.ఇప్పుడు ప్రొద్దుటూరు కబ్జాదారులు మాకంటే తోపులు ఎవరున్నారబ్బా. అంటూ సవాళ్లు విసురుతున్నారు.అటవీ భూమి అని చూడకుండా పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమి అని లెక్కచేయకుండా.కంటికి కనిపిస్తే చాలు కబ్జా కొట్టాల్సిందే అని దళారులు రెచ్చిపోతున్నారు.ఇప్పటికే ఫారెస్ట్ ల్యాండ్‌ను నిలువునా నమిలేసిన ఈ అక్రమార్కులు.ఇప్పుడు పారిశ్రామిక భూములపై పంజా విసిరి రాబందుల్లా వాలుతున్నారు.సామాన్యుడి సొంతింటి కల.దళారుల జేబుల్లో కాసులు.అన్నం పుణ్యం ఎరుగని అమాయకపు ప్రొద్దుటూరు జనాన్ని ఈ భూబకాసురులు...