📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetసిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..-సిద్దిపేట పోలీస్ కమిషనర్ఎస్.రష్మీ పెరుమాళ్, ఐపీఎస్..

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..-సిద్దిపేట పోలీస్ కమిషనర్ఎస్.రష్మీ పెరుమాళ్, ఐపీఎస్..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..-సిద్దిపేట పోలీస్ కమిషనర్ఎస్.రష్మీ పెరుమాళ్, ఐపీఎస్…

సిద్దిపేట జిల్లా, మార్చి 9, ప్రజావాణి

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు మార్చి 9, ఉదయం 6 గంటల నుండి మార్చి 24, ఉదయం 6 గంటల వరకు ఆమలులో ఉంటుంది.సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7(1) 2016, యాక్ట్, సెక్షన్ 55 డి బి (ఏ ), 45డి బి (ఏ ), 65డి బి (ఏ ), 30 పోలీస్ యాక్ట్ 1861, రూల్ నెంబర్ 8 నోస్ పొల్యూషన్, (రెగ్యులేషన్ & కంట్రోల్) రూల్స్ 2000 ప్రకారం పోలీస్ కమిషనర్, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి అధికారుల అనుమతి పొందాలనిసూచించదమైనది. పై నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వాళ్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పై నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ల పై సెక్షన్ 223 బి ఎన్ ఎస్ ఎస్ , సెక్షన్ 70(ఏ ), 70(బి ) 70 సి , 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.