📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బెల్టు షాపుల వద్ద ఏరులై పారుతున్న మద్యం...మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు

బెల్టు షాపుల వద్ద ఏరులై పారుతున్న మద్యం…మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్: (మార్చి 09) పోరుమామిళ్ల మండల పరిధిలో ఉన్నటువంటి బెల్టుషాపుల రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా మద్యం అమ్మకాలు.గుడి , బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు.నియోజకవర్గ పరిధిలోని ఏ గ్రామంలో చూసిన బెల్టుషాపుల ద్వారాఏరులై పారుతున్న మద్యం,.మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.ప్రభుత్వ వైన్ షాపులనుండి నేరుగా.యదేచ్చగా డోర్ డెలివరీ చేస్తున్న వైన్ షాపుల యాజమాన్యం.సిబ్బంది.ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో కేసులు ,కేసులు (పెట్టెలు, పెట్టెలు) మద్యం బాటిళ్లనబెల్టుషాపులకుతరలింపు.ఇదెక్కడి దారుణమని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్న ఇస్తున్న వైనం.కన్నెత్తి చూడలేని అధికార యంత్రాంగం.నెలవారీ మామూళ్లు ఇస్తున్నాం .మమ్మల్ని ఎవరు ఆపలేరు అంటూ రెచ్చిపోతున్న బెల్టు షాపుల యజమానులు.క్వార్టర్ బాటిల్ పై ఎంఆర్పి రేటు కంటే 20 నుంచి 40 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు,పోలీస్ యంత్రాంగం కూడా వెనకడుగు వేయడం లోని మతలబు ఏమిటో..ప్రభుత్వ వైన్ షాపుల నుండి అక్రమంగా బెల్టు షాపులకు మద్యం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకడుగు వేయడం లోనీ ఆంతర్యం ఏమిటి.గత ప్రభుత్వ హయాంలో కేవలం మండల కేంద్రాలకే పరిమితమైన మద్యం షాపులు నేడు ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి దర్శనమిస్తున్నాయి.గతంలో మద్యం సేవించేందుకు బ్రాందీ షాపుల వద్ద పర్మిషన్ లేకపోవడంతో మద్యం ప్రియులుక్వార్టర్, వాటర్, గ్లాస్ చేత పట్టుకొని చెట్లమ్మటి, గుట్టల వెంబడి వెళ్లేవారు.నేడు అదే క్వార్టర్ ,అదే వాటర్, అదే గ్లాస్ చేతబట్టి నడిరోడ్లపై యదేచ్చగా సేవిస్తున్న అడిగే నాధుడే కరువైపోయాడు.దీంతో అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది నడుస్తోందా? అనే సందేహం కలుగుతోంది.ఇప్పటికైనా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నటువంటి బెల్టు షాపులపై ముడుపుల మత్తు వీడి అధికారులు దాడులు చేసి వారిపై కఠినచర్యలు తీసుకుంటారా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.బహిరంగంగానే మా యొక్క వ్యాపారాలలో అధికారులు సైతం మాకు తోడున్నారు. రాకరాక మేము అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు సంపాదించుకొనకపోతే మరెప్పుడు సంపాదించుకోవాలి. అని చెబుతున్న బెల్టు షాపుల వారికి పోలీస్ యంత్రాంగం, ఎక్సైజ్ శాఖ పోలీసులు సరైన గుణపాఠం చెబుతారా? లేదా? అనేది వేచి చూడాల్సిన విషయంగ్రామీణ ప్రాంతాలలో వీధి కుళాయిలు సరిగా పనిచేసి తాగునీరు ప్రజలకు అందుతుందో? లేదో? తెలియదు కానీ, వీధికో బెల్ట్ షాప్ తో మూడు క్వార్టర్లు, ఆరు గ్లాసులు అన్నచందంగా పుష్కలంగా మద్యం లభిస్తోంది.కొందరు యువకులు అయితే.తెల్లవారుజామున లేవగానే కాఫీ కి బదులు బెల్ట్ షాపుల కెళ్ళి క్వార్టర్ కొడుతున్నట్లు గ్రామీణ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.ఈ తాగుబోతుల వల్ల వీధులలో మహిళలు తిరగాలంటేనే భయభ్రాంతులకు లోన అవుతున్నట్లు తెలిసింది.కావున జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి ఈ బెల్టు షాపులపై కఠినమైన చర్యలు తీసుకొని ప్రజల మానప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular