ప్రజావాణి న్యూస్:(మార్చి 09) టేకురుపేట జెడ్పీ హై స్కూల్ ఈ రోజు 14 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేరీ ఎల్సా గారు మరియు హెడ్ మాస్టర్ బాల గంగిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థినులకు హెచ్.పి.వి వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. బాలికలు చిన్న వయస్సులోనే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే సర్వికల్ క్యాన్సర్ అనే ప్రమాదకర వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. ప్రతి బాలిక ఆరోగ్యంగా ఉండేందుకు ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమని వివరించారు.ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాదు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, రాబోయేగురువారం’12వతేదీనటేకురుపేటప్రాథమికఆరోగ్యకేంద్రంనందుహెచ్.పి.వివ్యాక్సిన్కార్యక్రమాన్నిప్రారంభించనున్నట్లుతెలిపారు. 14 నుండి 15 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలు ఈ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించుకోవాలని ఆయన సూచించారు.అలాగే తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కూడాబాలికలకుఈవ్యాక్సిన్వేయించేందుకుసహకరించాలనిఆయనకోరారు.ఈకార్యక్రమంలోఉపాధ్యాయులు,ఆరోగ్య సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు
టేకురుపేట జెడ్పీ హై స్కూల్ నందు హెచ్.పి.వి వాక్సిన్ పై అవగాహన కార్యక్రమం
0
24
- Advertisment -



