📄 ePaper
Friday, March 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్:(మార్చి 08) విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, మహిళా నాయకులు మాజీ మంత్రి వెలంపల్లి కామెంట్స్ ఆడబిడ్డ నిధి” ఏమైంది? కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వెలంపల్లి శ్రీనివాస్!చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు.మహిళలనుమోసం చేయడంలో ఆయనే నంబర్1మహిళా సాధికారతకు కేరాఫ్ అడ్రస్ జగనన్న ప్రభుత్వమే 50 శాతం రిజర్వేషన్లతో మహిళలకు రాజ్యాధికారం.. జగనన్న పాలనలోనే సాధ్యం!చేయూత, కాపు నేస్తం పథకాలతో మహిళల్లో ఆర్థిక వెలుగులు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. పశ్చిమ వైసిపి మహిళా అధ్యక్షురాలు పేరూరి దుర్గ భవాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మరియు పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు బండి పుణ్యశీల, షేక్ రెహమాతున్నీసా, పడిగపాటి చైతన్య రెడ్డి, 50వ డివిజన్ ఇంచార్జ్ బంక విజయ, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మహిళలందరిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మహిళా సాధికారతకు స్వర్ణయుగమని కొనియాడారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ‘నవరత్నాలు’ పథకాల ద్వారా ప్రతి ఇంట్లోనూ అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వాలంబన కోసం జగన్ గారు కృషి చేశారని గుర్తు చేశారు. జగనన్న తన హయాంలో అమ్మ ఒడి ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి రూ. 15,000 జమ చేసి, తల్లుల ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. వైయస్ఆర్ ఆసరా & సున్నా వడ్డీ: పొదుపు సంఘాల మహిళల పాత అప్పులను నాలుగు విడతల్లో చెల్లించడమే కాకుండా, సున్నా వడ్డీ పథకం ద్వారా కోటి మంది మహిళలకు ఆర్థిక ఊరటనిచ్చారన్నారు. వైయస్ఆర్ చేయూత ద్వారా 45 నుండి 60 ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నాలుగేళ్లలో రూ. 75,000 ఆర్థిక సాయం అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారన్నారు. వైయస్ఆర్ కాపు నేస్తం మరియు ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల్లోని పేద మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారన్నారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి, ఇంటి యజమానులను చేశారన్నారు. మహిళల రక్షణ కోసం ‘దిశా’ యాప్ మరియు ప్రత్యేక పోలీస్ స్టేషన్ల ద్వారా భద్రతను కట్టుదిట్టం చేశారన్నారు. పథకాలతో పాటు నామినేటెడ్ పదవుల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా కూడా మహిళలను జగన్ గారు ఉన్నత స్థానాల్లో నిలబెట్టారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారతకు మరియు అభ్యుదయానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం (2019-2024) స్వర్ణయుగమని కొనియాడారు. ముఖ్యంగా ఆసరా, చేయూత, మరియు చేదోడు వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచారని, ప్రతి మహిళకు సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో మహిళల పేరు మీదనే సెంటు భూమి రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత జగన్ గారిదేనని పేర్కొన్నారు. 18 ఏళ్ల నుండి 50 ఏళ్ల లోపు మహిళలకు ఇస్తామన్న ‘ఆడబిడ్డ నిధి’ కింద ఒక్క రూపాయి కూడా ఇంతవరకు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరుగుతున్నాయని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్‌ను ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు మరియు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ​మహిళా సాధికారత సాధించాలంటే సూపర్ సిక్స్ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, మహిళలకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వైసిపి ఎస్ ఈ సి మెంబర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మహిళలకు స్వర్ణయుగం నడిచిందని, వారికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని కొనియాడారు. పుట్టిన బిడ్డ నుండి పెన్షన్ వచ్చే వయసు వరకు ప్రతి దశలోనూ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత జగన్ గారికే దక్కుతుందని వారు పేర్కొన్నారు. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు అవసరమైన తోడ్పాటును అందిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేశారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు భద్రత కరువైందని, వయో భేదం లేకుండా ఆడబిడ్డలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని వారు విమర్శించారు. ఈ అరాచక పాలన అంతం కావాలని, 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని “స్వర్ణయుగం” తిరిగి రావాలని మహిళలందరూ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మహిళా లోకమంతా నడుం బిగించి జగన్ గారిని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డీ మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు అత్యున్నత ప్రాధాన్యత లభించింది. మహిళా సాధికారతే ధ్యేయంగా అడుగులు వేశారని కొనియాడారు. చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లోకే నగదు జమ చేయడం జరిగిందన్నారు. ఏడాది పొడవునా ప్రతి నెలా ఒక పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత జగన్ గారికే దక్కుతుందన్నారు. ​మహిళ బాగుంటేనే కుటుంబం బాగుంటుందని నమ్మి, ఇంటి పట్టాలను సైతం మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించిన మహనీయుడు జగన్ మోహన్ రెడ్డి గారన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు, అరాచకాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో మహిళా సాధికారత కరువైందని మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి రాష్ట్రంలో మహిళలకు రక్షణ, ఆర్థిక మరియు రాజకీయ ఎదుగుదల లభించాలంటే 2029లో జగన్ మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని యావత్ ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకం కోరుకుంటోందని వెల్లడించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular