📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarనూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

📰 Generate e-Paper Clip

నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

 

 

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బుర్ర స్వామి కుమారుడు విక్రమ్ – సుప్రియల వివాహ వేడుక హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్ రెడ్డి, ఐలేని మల్లికార్జున్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బీలు నాయక్, అందే స్వామి, నాయకులు తిరుపతి రెడ్డి, మహేందర్ రెడ్డి, సిరాజ్, కత్తి స్వామి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.