📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetమానవత్వం చాటుకున్న త్రీ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్..

మానవత్వం చాటుకున్న త్రీ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా, మార్చి 7, ప్రజావాణి

సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమని తెలుసుకున్న సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్, తక్షణమే స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు.సిద్దిపేట నివాసి అయిన ఒక వ్యక్తికి రక్తం తక్కువగా ఉండటంతో, అత్యవసరంగా రక్తం కావాలని మిత్రుల ద్వారా కానిస్టేబుల్ శ్రీనివాస్, సమాచారం అందింది. విధి నిర్వహణలో ఉండి కూడా, సమాచారం అందిన వెంటనే స్పందించిన ఆయన, హుటాహుటిన ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌కు చేరుకున్నారు. సమయానికి రక్తదానం చేసి సదరు వ్యక్తి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular