📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్రామగుండంలో ప్రజాపాలన కాదు.. లాఠీ పాలన నడుస్తుంది..! ఖనిలో న్యాయవాదులకు...

రామగుండంలో ప్రజాపాలన కాదు.. లాఠీ పాలన నడుస్తుంది..! ఖనిలో న్యాయవాదులకు రక్షణ కరువే…? ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలం..

📰 Generate e-Paper Clip

ప్రజావాణి // గోదావరిఖని మార్చి 07

 

 

రామగుండంలో ప్రజాపాలన కాదు.. లాఠీ పాలన నడుస్తుంది..!

 

ఖనిలో న్యాయవాదులకు రక్షణ కరువే…?

 

ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలం..

 

వన్ టౌన్ సిఐ పై చర్యలు తీసుకోవాలి…

 

రామగుండం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు నియంతల.. బాధితులపైకే లాఠీలు ఝలుపుతున్నారని బాధితుల పక్షాన ప్రశ్నించే ప్రతిపక్షాలు, ప్రజలు, న్యాయవాదులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార నిరసన దీక్షలకు వ్యాల్ల హరీష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రామగుండంలో రాజ్ ఠాగూర్ ప్రజా పాలన పేరుతో నిరుపేద ల ఇండ్లు కూల్చడం ప్రశ్నించే గొంతులను అణగదొక్కడం గా రాజ్యమేలుతున్నారని ప్రజాస్వామ్యము న్యాయవ్యవస్థను కూడా కించపరుస్తూ న్యాయవాదులు అనే కనీస గౌరవం లేకుండా పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని ప్రజాస్వామ్యానికి ఇలాంటి విధానం మంచిది కాదని రామగుండం ఎమ్మెల్యే వెంటనే సీఐపై చర్యలు తీసుకొని న్యాయవాదులకు భద్రత కల్పించాలని కోరారు.

గత నెల రోజుల క్రితం స్థానిక న్యాయవాది మార్కాపురం తిలక్ పై వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అనుచితంగా అమర్యాద గా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనలో పాల్గొన్న కానిస్టేబుల్ పై కూడా వెంటనే సంబంధిత ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు న్యాయం జరిగేంత వరకు బి ఆర్ ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్, బక్కీ కిషన్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొలాడి శ్రీనివాస్ రావు , పర్శ స్వాతి, యువజన విభాగం అధికార ప్రతినిధి బూరుగు వంశీ కృష్ణ, అల్లి గణేష్, బోట్ల పోషం, కడమండ్ల శ్రీ హరి,కొండ సురేష్ పోయిల రవి ముజీబ్, రెహమాన్, షరీఫ్, అబ్దుల్ ఖాదీర్, దాడి తిరుమల్, ఉదయ్, శ్రీనివాస్ రావు, యుగేందర్, శివానంద, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.