📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialఅంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ ఆవుల మమత

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ ఆవుల మమత

📰 Generate e-Paper Clip

ఉండేడ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ ఆవుల మమత

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 07(ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల పరిధిలోని ఉండేడ గ్రామ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఈరోజు స్థానిక గ్రామ సర్పంచ్ ఆవుల మమత తిరుపతి యాదవ్ లు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారులకు, గర్భిణులకు అందుతున్న సేవలను, రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్ ను ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ… ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి వస్తువు లబ్ధిదారులకు సక్రమంగా అందాలని సూచించారు. ముఖ్యంగా బాలింతలకు, చిన్నారులకు అందించే గుడ్లు, బాలామృతం పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకూడదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరికీ సకాలంలో అందించాలని, కేంద్రం నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పోతు రవి, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular