📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

 

ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన గ్రామ సర్పంచ్ బెడ్డల ప్రవీణ్

 

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, మార్చి 7 (ప్రజావాణి):

 

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు యూనిఫామ్‌లు, ఇతర విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ బెడ్డల ప్రవీణ్, ఉప సర్పంచ్ గాదె విజయ ముఖ్య అతిథులుగా హాజరై, పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) విద్యార్థులకు యూనిఫామ్‌లు, షూస్, టైలు, బెల్టులు, బోధన అభ్యసన సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బెడ్డల ప్రవీణ్ మాట్లాడుతూ….  పూర్వ ప్రాథమిక విద్యను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పాఠశాలలకు కావాల్సిన టేబుళ్లు, విద్యార్థులకు కుర్చీలు, యూనిఫామ్‌లతో పాటు ఆట సామాగ్రిని సమకూరుస్తున్న విద్యాశాఖకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ రవికుమార్, ఉపాధ్యాయులు మామిడి సంతోష్, ప్రీ ప్రైమరీ టీచర్ తిరుమల, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.