📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetచిలుకూరు జెడ్పిహెచ్ఎస్ లో ఘనంగా మహిళా దినోత్సవం

చిలుకూరు జెడ్పిహెచ్ఎస్ లో ఘనంగా మహిళా దినోత్సవం

📰 Generate e-Paper Clip

చిలుకూరు మార్చి07(ప్రజావాణి):అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీ జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల చిలుకూరు నందు పాఠశాల మహిళా ఉపాధ్యాయులను, ప్రజాప్రతినిధులను,బోధనేతర సిబ్బందిని సన్మానించడం జరిగింది. మహిళా దినోత్సవం మహిళలు సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా, రాజకీయ రంగాలలో విజయాలు సాధించాలని ఆ విజయాల ద్వారా గుర్తించబడాలని, సమానమైన హక్కులు, సమానత్వం సాధికారత కోసం మహిళలు పాటుపడాలని, ఇల్లాలి చదువు ఈ జగతికి వెలుగుని నింపుతుందని మహిళ దినోత్సవ సందర్భంగా స్థానిక సర్పంచ్ శ్రీమతి కొల్లు పుల్లమ్మ నాగయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజారాం , పాఠశాల ఉపాధ్యాయులు,కోదండ రామయ్య,కేలాస.వెంకటేశ్వర్లు,ఎస్ కె.జానిమియా,అప్పారావు,జానకి రెడ్డి,శాంసన్, రేణుక,సజ్జన్ కుమార్,హామిదా బేగం,వేంకటేశ్వర్లు , సత్యం ప్రజాప్రతినిధులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular