📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సొంత వైద్యం ప్రమాదకరం మలేరియా సబ్ యూనిట్ అధికారి టి నరసింహ రెడ్డి

సొంత వైద్యం ప్రమాదకరం మలేరియా సబ్ యూనిట్ అధికారి టి నరసింహ రెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రజావాణి: బద్వేల్  సొంత వైద్యం ప్రమాదకరం మలేరియా సబ్ యూనిట్ అధికారి టి నరసింహ రెడ్డి వైద్యుని అనుమతి లేకుండా సొంతంగా మందులు తీసుకోవడం ప్రమాదకరమని, మలేరియా సబ్ యూనిట్ అధికారి టి నరసింహారెడ్డి అన్నారు. బద్వేల్ మండలంలో పాపిరెడ్డి పల్లెలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరిగింది. వైద్య సిబ్బంది ఫీవర్, లార్వా, ఇంటింటి సర్వే నిర్వహించి, లార్వా ఉన్నచోట నీటిని పడవేయించి , తొట్లు, డ్రమ్ములు, కూలర్లు, ఫ్రిజ్జులు శుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. దోమల నివారణ చర్యలు తీసుకోవాలంటూ, వీధులలో ర్యాలీని నిర్వహించారు. దోమల నివారణ చర్యలు ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలన్నారు. మినరల్ వాటర్ త్రాగకుండా ఉన్న నీటిని కాచి ,వడగట్టి త్రాగడం వలన ఆరోగ్యకరమన్నారు. 104, 108 ,విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా ప్రజలు మెరుగైన చికిత్స పొందాలన్నారు. ప్రజలు సుదూర ప్రాంతాలకు పోకుండా, అవసరం ఉన్నచోట మెడికల్ క్యాంపు నిర్వహించి, వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందేటట్లు చేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో పోయి వేల రూపాయలను పోగొట్టుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ వీరి జనార్దన్ రావు, ఏఎన్ఎంలు వాణి, మహాలక్ష్మి, వైద్య సిబ్బంది వెంకటలక్ష్మి, కామాక్షి లు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular