సొంత వైద్యం ప్రమాదకరం మలేరియా సబ్ యూనిట్ అధికారి టి నరసింహ రెడ్డి

ప్రజావాణి: బద్వేల్  సొంత వైద్యం ప్రమాదకరం మలేరియా సబ్ యూనిట్ అధికారి టి నరసింహ రెడ్డి వైద్యుని అనుమతి లేకుండా సొంతంగా మందులు తీసుకోవడం ప్రమాదకరమని, మలేరియా సబ్ యూనిట్ అధికారి టి నరసింహారెడ్డి అన్నారు. బద్వేల్ మండలంలో పాపిరెడ్డి పల్లెలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరిగింది. వైద్య సిబ్బంది ఫీవర్, లార్వా, ఇంటింటి సర్వే నిర్వహించి, లార్వా ఉన్నచోట నీటిని పడవేయించి , తొట్లు, డ్రమ్ములు, కూలర్లు, ఫ్రిజ్జులు శుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. దోమల నివారణ చర్యలు తీసుకోవాలంటూ, వీధులలో ర్యాలీని నిర్వహించారు....