📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపాత ముగ్ధంపురం గ్రామాన్ని చెన్నారావుపేట మండలంలోనే కొనసాగించాలి* ఎమ్మెల్యే దొంతి...

పాత ముగ్ధంపురం గ్రామాన్ని చెన్నారావుపేట మండలంలోనే కొనసాగించాలి* ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతి. చెన్నారావుపేట మార్చి5 (ప్రజావాణి)

📰 Generate e-Paper Clip

*పాత ముగ్ధంపురం గ్రామాన్ని చెన్నారావుపేట మండలంలోనే కొనసాగించాలి*

 

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతి.

 

 

చెన్నారావుపేట మార్చి5 (ప్రజావాణి)

 

 

చెన్నారావుపేట పాత ముగ్ధంపురం గ్రామాన్ని నర్సంపేట మండలము లో కాకుండా ప్రస్తుతమున్న చెన్నారావుపేట మండలంలోనే కొనసాగించాలని కోరుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి గ్రామ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు.గురువారం నాడు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు తమ విన్నపాన్ని తెలియజేశారు. భౌగోళికంగా, పరిపాలనా పరంగా గ్రామానికి చెన్నారావుపేట మండలమే సౌకర్యవంతంగా ఉంటుందని ఈ సందర్భంగా వారు వివరించారు. ఈ విన్నపంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ననుమాస కరుణాకర్, ఉప సర్పంచ్ అల్వాల శ్రీనివాస్, వార్డు సభ్యులు కట్టురి లక్ష్మణ చారి, జన్ను రమేష్, మాదాసి అనిత రమేష్, పటాన్ హసీనా బొత్త, అలాగే నాయకులు ననుమాస రాములు, నాగాపూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.