తంగళ్ళపల్లిలో నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహణ

ప్రజావాణి//తంగళ్ళపల్లి, మార్చి 2: తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శుభోదయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు నేషనల్ సైన్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నిత్యజీవితంలో సైన్స్ పాత్ర అత్యంత కీలకమని, ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి తంగళ్ళపల్లి సర్పంచ్ లక్ష్మి గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రదర్శనలను పరిశీలించారు. విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ కీబోర్డ్, సాండ్ క్లీనర్, బ్రెయిన్ మోడల్, వాక్యూమ్ క్లీనర్, బ్లడ్ టెస్ట్ విధానం, కిడ్నీ పని విధానం, హార్ట్ పని విధానం, నెఫ్రాన్ విధానం, రైన్ వాటర్ హార్వెస్టింగ్ విధానం, ఊపిరితిత్తుల పని విధానం, అగ్నిపర్వతం వంటి మోడళ్లను ఎంతో చక్కగా వివరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి లతా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యమని పేర్కొన్నారు. సైన్స్ టీచర్లు మమత, కవిత, నవీన, సుస్మితలు విద్యార్థులను ప్రోత్సహించారు. అలాగే ప్రీ-ప్రైమరీ ఇన్‌చార్జ్ పద్మశ్రీతో పాటు సరిత, కీర్తన, శిరీష, సుస్మిత తదితర ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం పాఠశాలలో ముందస్తుగా హోలీ సంబరాలను కూడా ఆనందంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగులు చల్లి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించడమే కాకుండా, ఉత్సాహభరిత వాతావరణం నెలకొల్పినట్లు నిర్వాహకులు తెలిపారు.




