📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో  చంద్రన్న చిత్రపటానికి పాలాభిషేకం

ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో  చంద్రన్న చిత్రపటానికి పాలాభిషేకం

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో

చంద్రన్న చిత్రపటానికి పాలాభిషేకం

 

మన ప్రజావాణి

చౌడేపల్లి, ఫిబ్రవరి 28:

 

 

చౌడేపల్లి మండలం పెద్దకొండమర్రి పంచాయతీ పెద్దకొండమర్రి గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో చౌడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పూల చంద్రమౌళి, కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

పెన్షన్ పంపిణీ సందర్భంగా గ్రామ నాయకులు, లబ్ధిదారులు కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఒకటో తేదీ ప్రభుత్వ సెలవు దృష్ట్యా పెన్షన్లు ఒక రోజు ముందుగానే అందజేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సిబ్బంది ఉదయమే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అందించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి పరిపాలనను మునుపెన్నడూ చూడలేదని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొన్నారు. చంద్రన్న ఆధ్వర్యంలో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని తెలిపారు.

కార్యక్రమంలో మండల నాయకులు, పూల చంద్రమౌళి, కుమార్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కేశవ రెడ్డి, సుభాన్, చెంగలరాయుడు, బాలి రెడ్డి,సచివాలయం సిబ్బంది, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular