కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో
ఎన్నికల సాధారణ పరిశీలకులు అలోక్ కుమార్
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వీలు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు అలోక్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని 20 వార్డులు, కాగజ్ నగర్ పరిధిలోని 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈనెల 11వ తేదీన పోలింగ్, 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఈ క్రమంలో విధులు కేటాయించబడిన అధికారులు తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని, జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




