📄 ePaper
5pm
7pm
Monday, November 30, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్కౌన్సిల్‌లో బూడిద జ్యోతి ప్రశ్నల వర్షం - లెక్కల్లో తేడాలపై నిలదీత

కౌన్సిల్‌లో బూడిద జ్యోతి ప్రశ్నల వర్షం – లెక్కల్లో తేడాలపై నిలదీత

📰 Generate e-Paper Clip

 

జనగామ, నవంబర్ 28 (ప్రజావాణి): జనగామ మున్సిపల్ 9వ సాధారణ కౌన్సిల్ సమావేశంలో 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి పలు కీలక అంశాలపై అభ్యంతరాలు, డిమాండ్లు లేవనెత్తారు.

67 అంశాల ఎజెండాలో గతంలో ఆమోదం పొందిన అంశాలను మళ్లీ చేర్చడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఖర్చు గతంలో రూ. 5.20 లక్షలుగా చూపి, ఇప్పుడు రూ. 4.28 లక్షలుగా చూపడంపై రూ. 74 వేల తేడాకు కారణం చెప్పాలని నిలదీశారు. సీసీ కెమెరాల అంచనా రూ. 1.70 లక్షల నుంచి రూ. 2 లక్షలకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు.

ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గతంలో వేసిన ప్లాస్టిక్ బోలార్లు 15 రోజులు కూడా నిలవలేదని, ఇప్పుడు మళ్లీ రూ. 4 లక్షలు వెచ్చించడం ప్రజాధనం వృథా అని, బ్రిడ్జి పక్కన మరో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.

సెంటర్ డివైడర్ పనుల్లో నాణ్యతా లోపంపై విచారణ జరిపి, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, రిపేరింగ్ ఖర్చు వారి నుంచే వసూలు చేయాలన్నారు. TUFIDCO, SDF నిధులను జనరల్ ఫండ్ నుంచి కాకుండా ప్రభుత్వ గ్రాంట్ ద్వారా తెప్పించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థల కేటాయింపుపై దరఖాస్తు కాపీ ఇవ్వాలని, అన్ని పార్టీలకు సమానంగా స్థలాలు కేటాయించాలని సూచించారు. గార్లకుంటను పార్కుగా డెవలప్ చేసి బ్యూటిఫికేషన్ చేయాలని ప్రతిపాదించారు.

ఈ సవరణలతో మిగిలిన ఎజెండా అంశాలకు ఆమోదం తెలుపుతున్నట్లు తెలిపి, తన అభ్యంతరాలను నోటు రూపకంగా చైర్మన్ కడకంచి బాలమణి, కమిషనర్ రాజశేఖర్ రెడ్డి లకు అందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.