📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్జనగామ జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రయత్నాలను తక్షణమే...

జనగామ జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలి

📰 Generate e-Paper Clip

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రానికి చెందిన సర్వే నెంబర్ 53/1/1 లోని 30 గుంటల స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయించాలని ఆ పార్టీ నాయకులు నేటి జనగామ మున్సిపల్ సమావేశం ఎజెండాలో పెట్టడం, దీని కోసం జిల్లా కలెక్టర్ పై ఒత్తిడి తీసుకురావడం అత్యంత బాధాకరం మరియు అన్యాయమని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయాన్ని జిల్లా పాడి రైతుల తరపున తెలంగాణ రైతు సంఘం (AIKS) జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్, తెలంగాణ విజయ డెయిరీ పాడిరైతుల పరిరక్షణ సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి సాదం రమేష్ లు కలిసి జనగామ మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి కి, కమీషనర్ రాజశేఖర్ రెడ్డి కి, బిఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు కి, సీపీఎం పార్టీ ఫ్లోర్ లీడర్ బుడిద జ్యోతి లకు వినతిపత్రాలు అందజేశారు.

అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్, విజయ డెయిరీ పరిరక్షణ సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి సాదం రమేష్ ఈ తీర్మానాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా రైతులకు వ్యవసాయంతో పాటు ప్రధానమైన రెండో ఆదాయ వనరుగా పాడి పరిశ్రమ ఎంతో అండగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే నాణ్యమైన పాల ఉత్పత్తిలో జనగామ జిల్లాకు ఎన్నో ఏళ్లుగా మంచి పేరుంది.

ప్రస్తుతం నెలకొన్న ఎల్-నినో వాతావరణ పరిస్థితుల వల్ల జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. డెయిరీ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో పచ్చిగడ్డిని పెంచి, జిల్లాలోని పాడి రైతులకు సరఫరా చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాడి రైతుల సమస్యలను పట్టించుకోకపోగా, ఇప్పుడు పాడి పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడాల్సిన విలువైన డెయిరీ స్థలాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకోవాలని చూడటం ఏమాత్రం సమంజసం కాదని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మరియు సంబంధిత నాయకులు విజయ డెయిరీ స్థలంలో పార్టీ ఆఫీసు నిర్మించాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి. లేనిపక్షంలో, రాబోయే రోజులలో జిల్లాలోని పాడి రైతులందరూ పెద్ద ఎత్తున కదిలి వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.