జనగామ జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలి

  జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రానికి చెందిన సర్వే నెంబర్ 53/1/1 లోని 30 గుంటల స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయించాలని ఆ పార్టీ నాయకులు నేటి జనగామ మున్సిపల్ సమావేశం ఎజెండాలో పెట్టడం, దీని కోసం జిల్లా కలెక్టర్ పై ఒత్తిడి తీసుకురావడం అత్యంత బాధాకరం మరియు అన్యాయమని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని జిల్లా పాడి రైతుల తరపున...